మంత్రి భార్య హోం నుంచి కిడ్నాప్
రాజమండ్రి: రాష్ట్ర మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు భార్య విజయలక్ష్మి నడుపుతున్న స్వధార హోం నుంచి ఇద్దరు బాలికలు కిడ్నాపయ్యారు. రాజమండ్రిలోని బుచ్చయ్యనగర్ లో కందుకూరి వీరేశలింగం ఎడ్యుకేషనల్ సొసైటీలో వ్యభిచారం చేస్తున్న స్త్రీలకు, వారి పిల్లలకు పునరావాసం కల్పించేందుకు విజయలక్ష్మి స్వధార హోంను నడుపుతున్నారు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత పది మంది ముసుగు మనుషులు వచ్చి ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేశారు.
బాలికల కిడ్నాప్ వ్యవహారం రాజమండ్రి తీవ్ర కలకలం సృష్టించింది. అర్థరాత్రి దాటిన తర్వాత రెండు, మూడు గంటల ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. వాచ్ మన్ సూర్యారావును బెదిరించి ముసుగు మనుషులు ఇద్దరు బాలికలను జీపులో ఎత్తుకుని వెళ్లారని ఆరోపణలు వచ్చాయి. విజయలక్ష్మి నడుపుతున్న స్వధార హోంపై ఇది వరకు కూడా పలు వివాదాలు చెలరేగాయి.












Click it and Unblock the Notifications