హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు లేఖపై గొడవ

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ బాధ్యత నుంచి రాష్ట్రంలోని ఉద్యోగులను తప్పించి, ఇతర రాష్ట్రాల ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి రాసిన లేఖ కలకలం సృష్టిస్తోంది. చంద్రబాబుపై రాష్ట్ర మంత్రులు ఆనం రాంనారాయణ రెడ్డి, బొత్సా సత్యనారాయణ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశాల్లో తీవ్ర విమర్శలు చేశారు. అధికార దాహంతో ఏం మాట్లాడుతున్నాడో చంద్రబాబుకు తెలియడం లేదని బొత్సా సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రిపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అసభ్యకరమైన పదజాలం వాడుతున్నారని, అటువంటి వ్యాఖ్యలను వాడకూడదని ఆఖరు సారి హెచ్చరిస్తున్నామని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆనం రాంనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులను అవమానించే విధంగా చంద్రాబాబు వ్యవహరించారని ఆయన అన్నారు. ఉద్యోగుల ఆత్మస్థయిర్యాన్ని చంద్రబాబు దెబ్బ తీయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసే తమపై ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విచారకరమని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దేవానంద్‌ అన్నారు. తమపై నమ్మకం లేదని చంద్రబాబు అన్నారని, ఎన్నికల కోడ్‌ వస్తే తాము ఎన్నికల కమిషన్‌ పరిధిలోనే పనిచేస్తామని, అధికారపక్షంతో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X