ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
నల్గొండ: నల్గొండ జిల్లాలో 9వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లాలోని నార్కెట్ పల్లి వద్ద ఇసుక లారీ-కారు ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. బంధువుల దినకర్మలకు హాజరయ్యేందుకు నల్గొండనుంచి నలుగురు మోత్కూరు వెళ్లేందుకు కారులో బయలుదేరారు.
నార్కెట్ పల్లిని దాటుతుండగా సూర్యాపేటనుంచి వేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొంది. దీంతో కారులోని కిరణ్, పవన్, చంద్రశేఖర్ అక్కడే మృతిచెందారు. వీరంతా నల్గొండవాసులు, అవివాహితులు. ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications