సత్యం స్కామ్: సెబీకి అనుమతి
హైదరాబాద్: సత్యం మాజీ సీఎఫ్‌ఓ, మాజీ ఆడిటర్లను విచారించేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని సెబి చేసిన విజ్ఞప్తిని హైదరాబాదులోని నాంపల్లి కోర్టు అంగీకరించింది. తమకు వారిని విచారించేందుకు తగిన సమయం లభించలేదని, మరి కొంత సమయం కావాలని కోరుతూ సెబి అధికారులు నాంపల్లి కోర్టులో పిటీషన్ వేశారు. ఇందుకు కోర్టు అనుమతించి రెండురోజులపాటు విచారణకు అనుమతి ఇచ్చింది. సత్యం మాజీ సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్, మాజీ ఆడిటర్లు గోపాలకృష్ణ, తాళ్లూరి శ్రీనివాస్‌లను సెబి అధికారులు రెండురోజులపాటు విచారిస్తారు.












Click it and Unblock the Notifications