తెలుగును కాపాడుకుందాం: ఎబికె
హైదరాబాద్: తెలుగు భాషను కాపాడుకోవలసిన అవసరం ఉందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎబికె ప్రసాద్ పిలుపు ఇచ్చారు. మాతృభాసా దినోత్సవ సందర్భంగా శనివారం ఏబికె ప్రసాద్ సచివాలయం ముందున్న తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలవేసి నమస్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుభాషను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తెలుగు భాషకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అందరూ తెలుగుభాషను మరిచిపోయారని, ఎక్కువగా ఆంగ్ల భాషను ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు భాషను వాడుకోకపోతే వెనుకబడే అవకాశం ఉందని ఏబీకే పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications