ఆదిలాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మీద, వైఎస్ జగన్ సాక్షి మీద క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఎ పాల్ మరోసారి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ తానంటే భయమని, ప్రభుత్వం అంతానికే ఈ పాల్ ఉన్నాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విలేఖరులతో మా ట్లాడారు. రాజశేఖరరెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని ఆ డబ్బుతో అబద్దాల సాక్షిని పెట్టి నిజాలు రాసే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.