6 వేలకు కొడుకుని అమ్ముకున్న తల్లి
ఖమ్మం: ఒక ఇరవై ఏళ్ళ యువతి తన ఒక రోజు బాలుడిని ఆరువేల రూపాయలకు అమ్ముకుంది. ఆస్పత్రి ఖర్చులు చెల్లించేందుకు ఆమె ఈ పని చేసింది. ఫిబ్రవరి 20 న తగరపు రజిత కొత్తగూడెం ఆస్పత్రిలో ఒక బాలుడికి జన్మనిచ్చింది. అనస్ధీషియా ఇవ్వడానికి ఆస్పత్రి సిబ్బంది ఆమెను రెండు వేల రూపాయల లంచం ఇవ్వమన్నారు. అమె అంత సొమ్ము చెల్లించలేక తన కుమారుడిని పిల్లలు లేని దంపతులకు 6000 రూపాయలకు అమ్మేసుకుంది.
మంచిర్యాలకు చెందిన రజిత రామ్మూర్తిని పెళ్ళి చేసుకుంది. అతనికి అప్పటికే పెళ్ళయిన విషయం ఆమెకు ఆలస్యంగా తెలిసింది. ఆమె అతడిని విడిచిపెట్టి కొత్తగూడెంలో తెలిసిన వారి ఇంటిలో నివాసం ఉంటోంది. ఆస్పత్రి అధికారులపై చర్య తీసుకోడానికి రంగం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications