చంద్రగిరి: చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు రోజా కార్యకర్తల కోరిక మేరకు చిందేశారు. సీపీఐ నాయకులతో కలిసి పర్యటిస్తున్న రోజాను చూసి ఆనందంతో ప్రజలు డాన్స్ చేయడం మొదలు పెట్టారు. అదిచూసి ఉత్సాహం తెచ్చుకున్న ఆమె కూడా వారితో జతకట్టింది. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఓక్స్ వ్యాగిన్ కంపెనీ రాక ముందే ముడుపులు తీసుకున్నమంత్రి బొత్స సత్యనారాయణకు పదవులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. ఇలాంటి అవినీతి నాయకులను వైఎస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు. అంతేగాక మహాకూటమిపై కాంగ్రెస్ అర్థంలేని విమర్శలు చేస్తోందని ఆమె అన్నారు.