న్యాయమూర్తుల జీతం లక్ష
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనాలు మూడింతలు పెరగనున్నాయి. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటు మంగళవారం ఆమోదించింది. గత వారమే లోక్‌సభలో పాసైన బిల్లుకు రాజ్యసభ కూడా అనుమతినివ్వడంతో జడ్జిల వేతనాలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటివరకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 33 వేల రూపాయల నెలసరి వేతనం ఉండగా అది ఇక ముందు లక్షకు చేరుతుంది.
న్యాయమూర్తులకు 90 వేల రూపాయలవుతుంది. న్యాయమూర్తుల సేవలను వారు తీసుకునే వేతనాలను బట్టి అంచనా వేయరాదని బిల్లుపై జరిగిన చర్చలో న్యాయశాఖ మంత్రి భరద్వాజ్ చెప్పారు. ఆరవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతనాలు ఇతర అలవెన్సులు కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications