హైదరాబాద్: ఏ రాష్ట్రం అన్నది ప్రధానం కాదని ప్రజలందరికీ సామాజిక న్యాయం అందినరోజు అభివృద్ధి దానంతట అదే వస్తుందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఒక ఇంట్లో పెరిగినవారు పెద్దయిన తరువాత విడిపోతారని అంతమాత్రాన ప్రేమలేనట్లు కాదని చిరు అన్నారు. తెలంగాణా ఏర్పడినా అందరూ ప్రేమతో కలిసి ఉండవచ్చని ఆయన అన్నారు. ప్రజారాజ్యంలో విలీనమైన నవ తెలంగాణా పార్టీ విలీనమైన సందర్భంలో ఈ విషయాన్ని చిరంజీవి అన్నారు.