ఇంజనీర్‌ను హత్య చేసిన చిరుద్యోగి
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంజనీర్ రామకృష్ణ హత్యకు గురికావటం సంచలనం సృష్టించింది. ఆయనను హత్యచేసి మృతదేహాన్ని గేటుముందే పడేశారు. రామకృష్ణ స్టీల్‌ప్లాంట్ రైల్వే సెక్షన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హత్యకు కారణాలను పోలీసులు కొన్ని గంటల్లోనే కనుక్కున్నారు. ఇటీవల తనిఖీలు చేస్తున్న సందర్భంగా ఆయన రమణయ్య అనే కలాసీని ప్రవర్తన సరిగా లేదంటూ విధులనుంచి తొలగించారు. అతని చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని సమాచారం రావటంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి ఇంటరాగేట్ చేయగా తానే రామకృష్ణను హత్య చేసినట్లు అంగీకరించాడు.












Click it and Unblock the Notifications