బస్సులు దగ్ధం చేసిన మాదిగలు

హైదరాబాద్‌: జంటనగరాల్లో ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు అర్థరాత్రి విధ్వంసానికి పాల్పడ్డారు. ఎల్బీస్టేడియం, రేతిఫైల్‌ బస్టాపుల వద్ద రెండు ఆర్టీసీ బస్సులను దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ రోజూ విధ్వంసానికి దిగుతున్న ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్‌ రేతిఫైల్‌ బస్టాప్‌ వద్ద ఆగి ఉన్న రాణిగంజ్‌-2 డిపో బస్సుకు ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఎల్బీస్టేడియం వద్ద ముషీరాబాద్‌ డిపోకు చెందిన మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుకు నిప్పంటించారు. ఈ ఘటనలో బస్సులు పూర్తిగా కాలిపోయాయి. బస్సులను దహనం చేసింది తామేనని అనంతరం వారు పలు ఛానళ్ల కార్యాలయాలకు ఫోన్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+