ఈ దొంగల రాజ్యం మారాలి: పవన్

Pawan Kalyan
ఏలూరు: అధికారంలోకి వచ్చి దొంగలు, గజదొంగల అవతారాలెత్తి రాష్ట్రాన్ని దోచుకోవడానికే కాంగ్రెస్‌, మహాకూటమిలు ప్రయత్నిస్తున్నాయని యువరాజ్యం అధినేత పవన్‌కళ్యాణ్‌ ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరంలలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, మహాకూటములపై నిప్పులు చెరిగారు.

మహాకూటమిలో ప్రతిసారి చేతులు పైకెత్తి నిలబడే ఆ నలుగురు తప్ప ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ప్రపంచ బ్యాంకు ఏజెంటు అంటూ చంద్రబాబును తిట్టిన రాఘవులు, టూరిజం తప్ప కమ్యూనిజం లేదన్న చంద్రబాబు, లేచిందే మొదలు తిట్టిపోసుకునే కేసీఆర్‌లు మహాకూటమిగా ఏర్పడి ప్రజల్ని మోసం చేశారని, ఆధికారంలోకి వస్తే మళ్లీ ఒకరికొకరు తిట్టుకుంటూ విడిపోయి మరోమారు ప్రజల్ని మోసం చేస్తారన్నారు.

జలయజ్ఞం పేరుతో సంపాదన యజ్ఞాన్ని చేపట్టారని వైఎస్‌ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ నిర్మించిన ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా సుస్థిరంగా ఉంటే ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులు ట్రయల్‌ రన్‌లోనే తుస్సుమంటున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదగడం కోసమే రోజా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+