హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఈరోజు కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్థి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాజంపేట మండలం మదనగోపాలపురంలో ఆయన ఇందిరమ్మ గృహాలను ప్రారంభిస్తారు. అలాగే రాజంపేట పట్టణంలో 20 కోట్లతో ఫ్త్లెఓవర్ బ్రిడ్జి, 40 కోట్ల వ్యయంతో చేపట్టిన అన్నమయ్య మంచినీటి పథకం తదితర అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేస్తారు. బద్వేలులో తాగునీటి సరఫరా పథకం, రోడ్డు, చెరువుల పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు. తాడిపత్రిలోకూడా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.