ప్రజారాజ్యం పిటిషన్ పై కోర్టు స్పందన
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయింపు అంశంపై గురువారం హైకోర్టు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి గుర్తు కేటాయించక పోవడానికి గల కారణాలు తెలియజేయాలని హైకోర్టు ఈసిని ఆదేశించింది. ఉమ్మడి గుర్తుపై న్యాయపోరాటం చేస్తున్న పిఆర్పీ తాజాగా హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.
టిఆర్‌ఎస్‌తో పాటు దేశంలోని ఇతర అనేక పార్టీలకు తొలిసారే ఉమ్మడి గుర్తు కేటాయించి తమ కు ఎందుకు కేటాయించరన్నది ప్రజారాజ్యం ప్రశ్న. అయితే 2004 ఎన్నికల తర్వాత మారిన నిబంధనల ప్రకారం ఏదైనా ఎన్నికలలో పోటీచేసి, ఎనిమిది శాతం ఓట్లు వచ్చిన పార్టీకే ఉమ్మడి గుర్తు కేటాయించగలమని ఇప్పటికే కోర్టుకు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications