హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కేసుల్లో నిందితులు రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజుతో పాటు ఆ సంస్థ మాజీ సీఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్‌ల రిమాండును నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈ రోజు వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా రాజు మరో సోదరుడు సూర్యనారాయణ రాజు నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ముందుస్తు బెయిలుకు దరఖాస్తు చేసుకున్న సూర్యనారాయణ రాజు కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ లొంగిపోయారు. అతని పాస్ పోర్టుతో సహా కోరిన డాక్యుమెంట్లను ఆయన కోర్టుకు సమర్పించారు.