విశాఖపట్నం: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఎ పి జె అబ్దుల్ గురువారం ఆంధ్రా యూనివర్శిటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రా యూనివర్శిటీలో జెరంటాలజీ అంతర్జాతీయ సదస్సును ఆయన ఈరోజు ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ సదస్సులో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. వివిధ దేశాల శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొంటున్నారు.