హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టులతో అమెరికాకు వెళ్లారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు ఊరట లభించింది. మధుయాష్కీ కుటుంబం నకిలీ పాస్‌పోర్టులతో అమెరికా వెళ్లారని వారు భారత ప్రభుత్వాన్ని, అమెరికా ప్రభుత్వాన్ని మోసం చేశారని ఆరోపిస్తు కాంగ్రెస్ సీనియర్ నేత గోనె ప్రకాశ్‌రావు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇది తమ పరిధిలోకి రాదని కేసును కొట్టివేసింది.