న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ నేదురుమల్లి జనార్థనరెడ్డి ఈసారి లోక్ సభకు పోటీ చేయడంలేదు. ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉండడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వంతో సరిపెట్టుకోవాలనుకుంటున్నారు. ఈరోజు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. తన అభ్యర్థిత్వంపై చర్చించారు. అనంతరం తాను రాజ్యసభతో సరిపెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. రేపు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఆయన కుమారుడికి టిక్కెట్ లభిస్తే ఆయన రాజ్యసభకు వెళతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కుమారుడికి హామీ లభించిందీ లేనిదీ మాత్రం తెలియలేదు.