ఎన్టీఆర్ అనుకరణ సాధ్యం కాదు: జూనియర్

టీడీపీని అధికారంలోకి తెచ్చెందుకు ఓ కార్మికుడిగా పనిచేసేందుకే మీ ముందుకు వచ్చాను, తాత గారిని అనుకరించడానికి ఖాకీ డ్రస్ వేసుకోలేదు, ఆయన్ను అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదని ఎన్టీఆర్ వెల్లడించారు. రూ.50 రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇచ్చింది టీడీపీయే అని, జన్మభూమి, ఐటీ ఘనత చంద్రబాబుదని, ఆయన ఎన్టీఆర్ ఆశయ సాధనకోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఓ వైపు ఎన్టీఆర్ ఆశయాలను చెబుతూ అధికార కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. రైతురాజ్యంగా చెప్పుకునే ఈ ప్రభుత్వం 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఓటుతో అవినీతిపరుల గుండెల్లో పోటు పొడవండి అని ఎన్టీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications