హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ సీటుకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ సహా ఎంతో మంది ఈ టికెట్ ను ఆశిస్తున్నారు. అయితే అశ్వనీదత్ కు టికెట్ ఇచ్చే అవకాశం దాదాపు లేనందున కొత్త అభ్యర్ధుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీటును పలువురు ఆశిస్తుండగా, తాజాగా కేతినేని కిషోర్ బాబు అనే ఎన్ ఆర్ ఐ పేరును జిల్లాకు చెందిన నేతలు పార్టీ అధిష్ఠానానికి సూచించినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే అధిష్ఠానం మాత్రం ఈ సీటుకు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు వల్లభనేని వంశీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది.