తిరుమల: చిరంజీవి కుమార్తె శ్రీజ, అల్లుడు శిరీష్ భరద్వాజ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. ప్రజారాజ్యం పార్టీ నేతలు కోరితే ప్రచారం చేస్తామని వారిద్దరు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వీరు భరద్వాజ్ తరఫు కుటుంబ సభ్యులతో కలిసి అదివారం రాత్రి విరామ సమయంలో తిరుమలేశుని దర్శించుకున్నారు. వివాహానంతరం వీరు తొలిసారిగా తిరుమలకు వచ్చారు. ఆలయంలో వెలుపల విలేఖరులతో మాట్లాడారు.
రాష్ట్రంలోని ప్రజలు మార్పు కోరుతున్నారన్నారు. 8 కోట్ల జనాభా పీఆర్పీ అధినేత చిరంజీవి వెంట ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లు చిరంజీవికి పట్టం కడుతారని ధీమా వ్యక్తంచేశారు.