ర్యాగింగ్ పై డీజీపీకి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: ర్యాగింగ్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ర్యాగింగ్ కేసుల్ని విచారించాలని ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో డీజీపీ, సీఎస్‌లకు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. ర్యాగింగ్ జరగడంపై కళాశాల యాజమాన్యాలు, డీజీపీల సంజాయిషీని కోరింది. మార్చి 30లోపు సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు అగ్రికల్చర్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనకు కళాశాల ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, వీసికి కూడా సుప్రీం నోటీసులు పంపింది. హిమాచల్ ప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై సుప్రీం సీరియస్‌గా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications