30 ప్రజారథాలకు చిరు పచ్చజెండా
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన నివాసం వద్ద మంగళవారం ఉదయం ప్రజా ప్రచార రథాలను ప్రారంభించారు. ఎన్నికలకోసం 50 రథాలను వాడుతున్నామని, తొలి విడతగా 30 రథాలను ఈరోజు ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతి రథంలో కళాకారుల బృందం ఉండి ప్రచారం చేయటమేకాక సీడీల ద్వారా ప్రత్యేక పాటలను ప్రజలకు వినిపిస్తామన్నారు. ఇందులోనే ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసే తన సినిమా డైలాగులను ప్రదర్శిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఈ రథాలు తిరిగి ప్రచారం చేస్తాయన్నారు. రథాలను ప్రారంభించిన అనంతరం ఆయన కొంతసేపు ఒక రథాన్ని నడిపారు.












Click it and Unblock the Notifications