బాలయ్యపై దగ్గుబాటి వ్యాఖ్యలా: బాబు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిది ప్రథమ స్థానమని ఆయన అన్నారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ముఖ్యమంత్రిపై పది జిల్లాల్లో కేసులున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఎన్నికల కమిషన్ ను కోరారు. డిజిపి ఎఎస్ఎస్పీ యాదవ్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా వుంటే, సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి చంద్రబాబుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు హరీష్ రావుతో కలిసి గురువారం మధ్యాహ్నం సమావేశమయ్యారు. తెరాస 51 శాసనసభా స్థానాలను అడుగుతుండగా, తెలుగుదేశం 45 స్థానాలు కేటాయించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. కాగా, సిపిఎం 16 శాసనసభా స్థానాలకు, రెండు లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. భువనగిరి లోకసభ స్థానానికి నోముల నర్సింహయ్య పేరును సిపిఎం కార్యవర్గ సమావేశం గురువారం ఖరారు చేసింది. ఆయన ప్రస్తుతం నకిరేకల్లు శాసనసభా స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్లగొండ లోకసభ స్థానం డీలిమిటేషన్ లో పోయి భువనగిరి స్థానం కొత్తగా ఏర్పడింది. నల్లగొండ లోకసభ స్థానానికి ప్రస్తుతం సిపిఐ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహా కూటమి సీట్ల సర్దుబాటులో భువనగిరి లోకసభ స్థానం సిపిఎంకు కేటాయించినట్లు భావించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications