ఇక హైకమాండ్ దే జాప్యం: డిఎస్

పెన్మెత్స కినుక నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీచేసే ప్రసక్తే లేదని సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెన్మత్స సాంబశివరాజు విజయనగరంలో అన్నారు. తాను తొలినుంచి అసెంబ్లీ పోటీకి సిద్ధంగా లేనని, విజయనగరం ఎంపీగా మాత్రమే పోటీ చేస్తానని, ఈ విషయం అనేకసార్లు అధిష్టానానికి చెప్పానని అన్నారు. టీడీపీకి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉదయం కాంగ్రెస్‌లో చేరితే సాయంత్రంకల్లా నల్గొండ ఎంపీ సీటు ఇచ్చారని, 50 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తనకు ఇవ్వకపోవటం అన్యాయమని అన్నారు. తనకు ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోతే ఏం చేసేది రెండురోజుల్లో చెబుతానన్నారు.












Click it and Unblock the Notifications