చిరు మార్పుపై ఎన్టీఆర్ విసుర్లు

రాష్ట్రం కాంగ్రెస్ అవినీతి కోరల్లో చిక్కుకుపోయిందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు అవినీతిని విచారించడానికి ఈ కోర్టులు సరిపోవని, ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. పాలిచ్చే ఆవు తెలుగుదేశం పార్టీని కాదని, కుళ్ల బొడిచే ఆంబోతును గెలిపించారని ఆయన అన్నారు. పేదలను, మధ్యతరగతి ప్రజలను, రైతులను ఆదుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వాగ్దానాలను ఆయన ప్రస్తావించారు. వరాలిస్తే ప్రజలు సోమరిపోతులవుతారని కాంగ్రెసు వారంటున్నారని, కాంగ్రెసు నాయకులే సోమరిపోతులవుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications