పురంధేశ్వరిపై గంటా: బాబుపై ప్రసాద్

బిజెపిలో ఉన్న ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజును నర్సాపురం లోకసభ సీటు నుంచి పోటీకి దించేందుకు సిద్ధపడుతోంది. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కళ్యాణిని, మచిలీపట్నం నుంచి ముత్తంశెట్టి విజయనిర్మలను పోటీకి దించే యోచనలో ఉంది. అలాగే అమలాపురం లోకసభ సీటును మాలమహానాడు నేత స్వర్గీయ పివి రావు భార్య ప్రమీలకు కేటాయించే అవకాశం ఉంది.కుప్పం శాసనసభా స్థానంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఎంవి ప్రసాద్ ను పోటీకి దించే ఆలోచనలో ఉంది. జనరల్ స్థానాల్లో కొన్నింటిని ఎస్సీలకు కేటాయించాలనే ఆలోచన కూడా ప్రజారాజ్యంలో జరుగుతోంది.












Click it and Unblock the Notifications