సీపీఐ నేత పొట్లూరి కన్నుమూత
హైదరాబాద్: సీపీఐ సీనియర్ నేత పొట్లూరి నాగేశ్వరరావు కన్నుమూశారు. వామపక్ష ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన నాగేశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆయన మృతికి సీపీఐ నేతలు, ఇతర రాజకీయపక్షాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం పంజాగుట్ట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు.
నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఆయన జీవితాంతం పనిచేశారు. ఆడంబరాలకు, హంగులకు ఆయన ఎప్పుడూ దూరంగా ఉంటూ వచ్చారు. పలువురు కమ్యూనిస్టు ఉద్యమ నేతలకో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన జీవితంలో ఏనూడూ రాజీపడలేదు.












Click it and Unblock the Notifications