రైలింజన్ ను ఆపలేరు: పవన్ కళ్యాణ్
గుంటూరు: హస్తం అడ్డు పెట్టి సూర్యుడ్ని ఆపగలరేమో గాని రైలింజన్ ను ఆపలేరని యువరాజ్యం అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ విజయం ఖాయమని ఆయన అన్నారు. అందరికీ పార్టీ టిక్కెట్లను కేటాయించలేకపోవడం వల్లనే నిరసనలు పెల్లుబుకుతున్నాయని, టిక్కెట్లను ఆశించినవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.
యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గుంటూరు జిల్లా యాత్ర విజయవంతంగా సాగుతోంది. మొదటిరోజు వినుకొండ, గురజాల నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన రాత్రి దాచేపల్లిలో బస చేశారు. ఆదివారం ఉదయం దాచేపల్లి నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతోంది. గురజాల, దుర్గి, మాచర్ల, నాగార్జునసాగర్‌లలో ఆయన రోడ్‌షోల్లో పాల్గొననున్నారు.












Click it and Unblock the Notifications