భువనగిరికి నోముల: అరకుకు మిడియం
హైదరాబాద్: సిపిఎం తమ అభ్యర్థుల రెండో జాబితాను సోమవారం విడుదల చేసింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం పార్టీతో సిగపట్లకు దిగిన సిపిఎం చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ జాబితాను విడుదల చేసింది. శాసనసభా స్థానాలకు పాయం వెంకయ్య (అశ్వారావుపేట), చుక్కా రాములు (పటాన్ చెరు), ఎం.శ్రీనివాస రెడ్డి (కార్వాన్), సిహెచ్ నర్సింగరావు (గాజువాక), భాను రాజు (నెల్లూరు రూరల్) పేర్లను సిపిఎం సోమవారం ఖరారు చేసింది.
భువనగిరి లోకసభ స్థానానికి నోముల నర్సింహయ్య, అరకు లోకసభ స్థానానికి మిడియం బాబూరావు పేర్లను సిపిఎం ప్రకటించింది. తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని సిపిఎం తెలుగుదేశం పార్టీతో తగాదాకు దిగుతూ వస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఆదివారం రాత్రి కూడా ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ముగిశాయని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుండగా ఇంకా కొలిక్కి రాలేదని సిపిఎం అంటోంది.












Click it and Unblock the Notifications