దేశం, తెరాస పొత్తు: మళ్లీ చిచ్చు
హైదరాబాద్: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య సీట్ల సర్దుబాటు చిచ్చు మళ్లీ చెలరేగింది. తెరాసకు కేటాయించిన దాదాపు 25 శాసనసభా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను పోటీకి దించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారికి బీ - ఫారాలు ఇవ్వడానికి కూడా వీటిలో ఉప్పల్, కూకట్ పల్లి, పరకాల, భూపాలపల్లి, హుజూర్ నగర్ స్థానాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. ఉప్పల్ నుంచి సుధీర్ రెడ్డి, కూకట్ పల్లి నుంచి కృష్ణారావు, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, హుజూర్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి పేర్లను ఖరారు చేసి వారికి బీ - ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఐదు స్థానాల్లో తెరాస అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సూర్యాపేట, మహేశ్వరం వంటి స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహేశ్వరం నుంచి తీగల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముషీరాబాద్ సీటులో కూడా తెలుగుదేశం పార్టీ నామినేషన్ వేయాలని నిర్ణయించుకుంది.
ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇందుకు సంబంధించిన చర్చలు జరిగినట్లు చెబుతున్నారు. ఈ చర్చల్లో భాగంగానే ఐదు స్థానాలకు తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు చేయించిన సర్వేలో తెరాస సీట్లు ఓడేపోయే ప్రమాదం ఉన్నట్లు తేలిందని, దాంతో చంద్రబాబు కెసిఆర్ తో చర్చించి తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. నామినేషన్లు వేయడానికి సోమవారం చివరి గడువు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు వేగంగా కదిలి ఇందుకు సంబంధించి వ్యవహారాలు నడిపినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications