బాలయ్య, ఎన్టీఆర్ సినీ షోలు: వైయస్

YS Rajasekhar Reddy
నిజామాబాద్: సినీ నటులు బాలకృష్ణ మార్నింగ్ షో చూపిస్తుంటే, జూనియర్ ఎన్టీఆర్ మ్యాట్నీ చూపిస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరే ముందు ఆయన బుధవారం ఉదయం ఆదిలాబాదులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన హామీలను తాము అమలు చేయిస్తామని ఆయన బావమరిది ఒకరు బాలకృష్ణ, మరో బావమరిది కొడుకు జూనియర్ ఎన్టీఆర్ హామీలు ఇస్తున్నారని, చంద్రబాబు మాటలకు విశ్వసనీయత లేకపోవడం వల్లనే వారు ఆ హామీలు ఇస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు వాగ్దానాలకు విశ్వసనీయత లేదని, చంద్రబాబును ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆయన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ప్రచార సభలో అన్నారు. తాము ప్రజలకిచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకున్నామని ఆయన చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్తును ఇచ్చామని, కరెంట్ చార్జీలను, రుణాలను మాఫీ చేశామని ఆయన చెప్పారు. తాము ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను ఆయన వివరించారు. ప్రజలకు మేలు చేసే కాంగ్రెసు పార్టీని ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+