గౌహతిలో పేలుడు: నలుగురు మృతి

గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో శక్తివంతమైన కారు బాంబు పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. కారులో పెట్టిన బాంబు సోమవారం మధ్యాహ్నం పేలింది. ఈ పేలుడు జాలుక్ బరీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

పేలుడులో పలు కార్లు దగ్ధమయ్యాయి. ఈ పేలుడుకు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (ఉల్ఫా) తిరుగుబాటుదారులై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఉల్ఫా పతాకావిష్కరణ దినం సందర్భంగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తామే దాడికి పాల్పడ్డామని ఉల్ఫా తెలియజేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+