మాపై నిఘా ఉంది: చిరు

పార్టీ హైకమాండ్ ను సంతోషపెట్టడమే కాంగ్రెసు పెద్దల పనిగా మారిందని చిరంజీవి విమర్శించారు. తమ పార్టీ ఎన్నికల ప్రణాళికను ఆయన సోమవారంనాడు మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. ముసాయిదాలో మార్పులు చేర్పులు ఏమీ లేవని, ముసాయిదానే తుది ప్రణాళికగా విడుదల చేస్తున్నామని ఆయన చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే మ్యానిఫెస్టోను రూపొందించామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యబద్దంగానే దాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం తాగునీటి సమస్యను కూడా పరిష్కరించలేకపోయిందని ఆయన విమర్శించారు.
ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో అవినీతి వ్యవస్థీకృతమైపోయిందని, రాజకీయ అవినీతి మరీ దారుణంగా ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ అవినీతి వల్ల ఖజానా ఖాళీ అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అవినీతి వల్ల వోక్స్ వ్యాగన్, మైటాస్ వంటి సంస్థల వ్యవహారాలు నడిచాయని, దీనివల్ల పెట్టుబడులు పెట్టేవారు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. సెజ్ ల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ కుంభకోణాల గురించి చెప్పనలవి కాకుండా ఉందని ఆయన అన్నారు. తాము ఓట్ల కోసం హామీలు ఇవ్వడం లేదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు. టిక్కెట్ల పంపకంలో దేశంలోనే తాము అత్యధికంగా బిసీలకు ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు.
మ్యానిఫెస్టోలోని కొన్నిముఖ్య వాగ్దానాలు
మహిళలకు వంద రూపాయలకే వంట సరుకు
అర్హులకు వంద రూపాయలకే గ్యాస్ సరఫరా
నిరుపేదలకు రెండున్నర ఎకరాల మాగాణి లేదా ఐదెకరాల మెట్ట
రైతులకు నీటి తీరువా రద్దు
రైతు బంధు పథకం అమలు
గర్భిణులకు ఆరు నెలల పాటు నెలకు వేయి రూపాయల చొప్పున సాయం
బెల్టు షాపుల రద్దు
బూటకం ఎన్ కౌంటర్లకు స్వస్తి
ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా ఫైనాన్స్ కార్పోరేషన్లు
డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు
ప్రతి మండలానికి సంచార వైద్యశాల
తెలంగాణ ఏర్పాటుకు చర్యలు
స్థానిక సంస్థలకు నిధుల బదలాయింపు
వృద్ధులకు బస్సు టికెట్లలో 50 శాతం రాయితీ
తాండాలకు ప్రత్యేక పంచాయితీలుగా గుర్తింపు
ఆడపిల్లలకు పొదుపు ఖాతా
వికలాంగులకు నెలకు 1500 రూపాయల సాయం












Click it and Unblock the Notifications