హైదరాబాద్: ప్రమాదంలో గాయపడిన ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కోలుకుంటున్నారని తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు చెప్పారు. ఆయన సోమవారం ఉదయం కిమ్స్ లో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ ఉత్సాహంగా ఉన్నారని, బాగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.
ఎప్పుడెప్పుడు బయటకు వద్దామా అని జూనియర్ ఎన్టీఆర్ ఉత్సాహపడుతున్నట్లు ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల ముందుకు వస్తారని ఆయన అన్నారు. కెఎస్ రామారావుతో పాటు పలువురు జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.