బాబు పుత్రుడు లోకేష్ ప్రచారం

Nara Lokesh
కుప్పం: తన తండ్రి విజయం కోసం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ కుప్పం నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. చంద్రబాబు తరఫున ఎన్నికల నామినేషన్‌ కోసం వేయడానికి లోకేష్ ఇక్కడికి వచ్చారు. చంద్రబాబు కోసం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండలంలో కార్యక్రమాన్ని ప్రారంభించి 23 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పలు చోట్ల ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో చేపట్టిన జన్మభూమి, ప్రజల వద్దకు పాలన, డ్వాక్రా సంఘాల ఏర్పాటు, 'దీపం' కింద వంటగ్యాస్‌ కనెక్షన్లు, పనికి ఆహారపథకం వంటి కార్యక్రమాలు, పథకాలను ఆయన ప్రస్తావించారు.

ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం ఇచ్చిన హామీలను ఆయన వివరించారు. పేద కుటుంబాలకు అమలు చేయనున్న అయిదు రకాల పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యత్నించారు. పేదలకు నగదు బదిలీ పథకం, ఎన్టీఆర్‌ ఆరోగ్య పథకం, ఉచితంగా కలర్‌ టీవీలు, రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక ప్యాకేజీ, యువత అభ్యున్నతికోసం 'ఎస్‌' (యూత్‌ ఎన్‌ పవర్‌ మెంట్‌ స్కీం) అనే సంక్షేమ పథకాలను ఏవిధంగా అమలు చేస్తామన్న విషయాలను ప్రజలకు సవివరంగా తెలియజెప్పారు. విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న నగదు బదిలీ పథకం మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామని వెల్లడించారు. పథకాలను మాటల్లోనే కాదని, చేతల్లో కూడా చేసి చూపెడతామని లోకేష్‌ పలుచోట్ల స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ పాలనలోని అవినీతిని, జలయజ్ఞంలో అక్రమాలను లోకేష్‌ ప్రసంగంలో ఎత్తిచూపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+