గాంధీ భవన్ ఘటన: మహేష్ మాదిగ మృతి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేపట్టిన ఆందోళనలో భాగంగా గాంధీభవన్‌పై జరిగిన దాడిలో గాయపడిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్త మహేష్ మాదిగ మృతి చెందారు. గాంధీభవన్‌లో ఫర్నీచర్‌కు నిప్పు అంటించినప్పుడు కొందరు కార్యకర్తలకు కూడా మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఇమేజ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. వారిలో ఇద్దరు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, ఓ సెక్యూరిటీ అధికారి ఇప్పటికే మృతి చెందగా మహేష్ మాదిగ మాత్రం గాయాలు తగ్గిపోయాయని భావిస్తున్న తరుణంలో ఇన్ ఫెక్షన్ సోకటంతో ఈరోజు మృతి చెందారు. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ఇటువంటి విషాద వార్తలు మాదిగ ఓటర్ల మీద ప్రభావం చూపించవచ్చు.












Click it and Unblock the Notifications