హైదరాబాద్: మహాకూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహా కూటమి మట్టి కరిపించడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సోమవారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో ఆయన సోమవారం మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్, బిజెపిలను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకే మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు నారాయణ వివరించారు. అందులో భాగంగానే రాష్ట్రంలో తెలుగుదేశం, తెరాసలతో జట్టు కట్టినట్లు చెప్పారు.
కరెన్సీ నోట్లు అధికంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు ఓట్లు పడే అవకాశం లేదన్నారు. మహాకూటమి ప్రస్తుతం శక్తివంతంగా మారిందని నారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణను ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన అన్నారు.