రెబెల్స్ పై కఠిన చర్యలు: వాయలార్ రవి
హైదరాబాద్: తిరుగుబాటు అభ్యర్థులతో మాట్లాడి పార్టీకి అనుకూలంగా వారిని మార్చటమే తన ప్రథమ కర్తవ్యమని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల తాత్కాలిక ఇన్‌ఛార్జి వయలార్ రవి అన్నారు. నూతన బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనవాస్, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిలతో చర్చించి తిరుగుబాటు అభ్యర్థుల విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
అసమ్మతులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాన్ని వారిద్దరితో చర్చించిన తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. అసమ్మతి నేతలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేసారు. అసమ్మతి నేతలు, అసంతృప్తులపై ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు వయలార్ వివరించారు. ఆయన కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు.












Click it and Unblock the Notifications