ఎస్పీ ఎదుట వైయస్ అల్లుడు లొంగుబాటు
ఖమ్మం: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, క్రైస్తవ మతబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ సోమవారంనాడు ఖమ్మం జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) ముందు లొంగిపోయారు. కాంగ్రెసుకు ఓటేయాలని పాస్టర్ల సమావేశంలో సూచించినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఆయన ఎస్పీ ముందు లొంగిపోయారు. ఈ కేసులో పోలీసులు కొంత మంది పాస్టర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ లొంగిపోయారు.
ఇంతకు ముందు కూడా ఆయన ఇటువంటి సూచన చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో అనిల్ కుమార్ ఊరట లభించింది. అధికార పార్టీని గెలిపించాలని కోరడంలో తప్పు లేదని ఆయన వాదించారు.












Click it and Unblock the Notifications