తిరుపతిలో నా ఓటమికి కుట్ర: చిరు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు పేదలను మభ్య పెడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి విమర్శించారు. చంద్రబాబు నగదు బదిలీ హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విజయభేరి పేరుతో ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టిన చిరంజీవి మంగళవారం నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటన చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నగదు బదిలీ పథకాన్ని తొమ్మిదేళ్ల పాటు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల మనోభావాలను తెలుసుకుని సామాజిక తెలంగాణ ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశామని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు వైఎస్ అడ్డంకి కాగా తెలుగుదేశానికి చిత్తశుద్ధ్ది లేదని ఆయన అన్నారు. కమ్యూనిస్టులకు, టీడీపీకి తెలంగాణ ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉంటే మహాకూటమి మేనిఫెస్టోలో చేర్చవచ్చు కదా అని ప్రశ్నించారు. నాయకుల ధనాశ వల్లే నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోలేదని అన్నారు.












Click it and Unblock the Notifications