నిందితుడ్ని చంపిన గ్రామస్థులు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలోని గౌస్ మియా గుడా గ్రామస్థులు ఒక వ్యక్తిని కొట్టి చంపారు. ఈ సంఘటన బుధవారంనాడు జరిగింది. గ్రామస్థుల చేతిలో హతమైన అంజయ్య అనే వ్యక్తి ఒక హత్య కేసులో నిందితుడు. అతను గతంలో ఒక హత్యకు పాల్పడి పారిపోయాడు. అతను బుధవారంనాడు గ్రామానికి వచ్చాడు. గ్రామస్థులు అతన్ని పట్టుకుని చితక బాదారు.
గ్రామస్థుల బారి నుంచి తప్పించుకుని పారిపోవడానికి అంజయ్య ప్రయత్నించాడు. అయితే గ్రామస్థులు అతన్ని మళ్లీ పట్టుకుని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. దీంతో అతను మరణించాడు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications