వైయస్ కీలుబొమ్మ సోనియా: కెసిఆర్

తెలంగాణ కోసం ఢిల్లీలో అందరి చుట్టూ తిరుగుతుంటే ఎగతాళి చేశారన్నారు. 1956లో తెలంగాణను ఊడగొట్టిందీ కాంగ్రెస్సే, ఇప్పుడు తెలంగాణ రాకుండా అడ్డుపడుతోందీ కాంగ్రెస్సే అని విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణ పాలిట శాపమని, తెలంగాణలో జరిగే అన్యాయానికి, దాష్టీకానికి కాంగ్రెసే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పోతేనే తెలంగాణ వస్తుందన్నారు.అధికారంలోకి వచ్చేది మహాకూటమియేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో అన్నింటికన్నా తనకు నచ్చినది నగదు బదిలీ పథకమని చెప్పారు. ఈ పథకంలో మధ్య దళారీలు, పైరవీకారులకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications