ప్రిలిమ్స్ లో రిజర్వేషన్లు లేవు: సుప్రీం
హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటంతో రిజర్వేషన్ల అంశంపై గందరగోళం తొలగిపోయిందని ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1984నుంచి ఈ సమస్య ఉందన్నారు. హైకోర్టు గతంలో రిజర్వేషన్లు అవసరం లేదని తెలిపిందని, తిరిగి 2008లో పాటించమని ఆదేశించిందని దీంతో గందరగోళం నెలకొనటంతో తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని ఆయన వివరించారు.
ఎపిపిఎస్సీ ప్రిలిమ్స్ లో 1984కు ముందు 1:15 మేరకు రిజర్వేషన్లు ఉండేవి. దీన్ని సవాల్ చేస్తూ ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్లాడు. ప్రిలిమ్స్ అర్హత పరీక్షనే కాబట్టి రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని హైకోర్టు 1984లో తీర్పు వెల్లడించింది. అప్పటి నుంచి ఎపిపిఎస్సీ రిజర్వేషన్లను పాటించడం లేదు. అయితే 2008లో రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications