అనకాపల్లి: తండ్రి అల్లు అరవింద్ కోసం సినీ నటుడు అల్లు అర్జున్ బుధవారం అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తన జన్మదిన వేడుకలను ఆయన బుధవారం అనకాపల్లి జరుపుకున్నారు. ఆయనను చూడడానికి పెద్ద యెత్తున అభిమానులు తరలి వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు.
జన్మదిన వేడుకల అనంతరం ఆయన అనకాపల్లి లోకసభ నియోజకవర్గంలో రోడ్ షోలు చేపట్టారు. పరవాడ, సబ్బవరం, లంకేపల్లి, గుల్లేపల్లి, పినగాడ తదితర ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.