చంద్రబాబుపై రాహుల్ విసుర్లు

తమకు, ప్రతిపక్షాలకు చాలా తేడా ఉందని, కాంగ్రెసు, ప్రతిపక్షాల ఆలోచనలకు మధ్య పొంతన లేదని, తాము దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామని, ప్రతిపక్షాలు కొన్ని ప్రాంతాలపైనే దృష్టి పెడుతున్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ నేతలు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల ఆలోచనలు ఈ దేశాభివృద్ధి కోసమేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పేదల మేలు కోసం పనిచేస్తోందని ఆయన చెప్పారు. రుణాల మాఫీని, సమాచార హక్కు చట్టాన్ని, ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications