ఇంటికి చేరుకున్న జూ. ఎన్టీఆర్
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జూనియర్ ఎన్టీఆర్‌ను శుక్రవారం రాత్రి 12.30 గంటలకు సికింద్రాబాదులోని కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. గత నెల 26న నల్గొండ జిల్లాలోని మోతే వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడిన విషయం తెలిసిందే. ఆయన చాలా వరకు కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఎన్టీఆర్‌ను స్ట్రెచర్‌పైనే ఆంబులెన్సులో ఇంటికి తరలించారు. డిశ్చార్జి విషయం ముందే తెలియడంతో ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. 'జయహో ఎన్టీఆర్' అంటూ నినాదాలు చేశారు.
ప్రమాదంలో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్‌కు మరో నాలుగు వారాలపాటు విశ్రాంతి అవసరమని కిమ్స్ సీఈఓ డాక్టర్ భాస్కరరావు విలేకరులకు తెలిపారు. ఇంట్లోనే తగిన ఏర్పాట్లు చేసుకుని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. అయితే సినిమా షూటింగుల్లో పాల్గొనేందుకు, నృత్యాలు చేసేందుకు వీలుగా వంద శాతం కోలుకోవాలంటే మరో రెండు నెలల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేదన్నారు. ఫిజియోథెరపీ నేర్పించామని, ఇంట్లో ఉండి చేసుకోవచ్చని చెప్పారు. నాలుగువారాల తర్వాత ఎంఆర్‌ఐ, సీటీస్కాన్ తీస్తామన్నారు. బహిరంగ సభల్లో పాల్గొనవచ్చా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ధైర్యం, అత్మస్త్థెర్యం మీదే అది ఆధారపడి ఉంటుందని కిమ్స్ సీఈఓ తెలిపారు.












Click it and Unblock the Notifications