టెర్రరిస్టులకు బిజెపి మోకరిల్లింది: రాహుల్
కరీంనగర్: భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉగ్రవాదులకు మోకరిల్లిందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ విమర్శించారు. బిజెపి ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటుపై దాడి జరిగిందని ఆయన అన్నారు. కందహార్ లో భారత విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తే బిజెపి ప్రభుత్వ జైల్లో ఉన్న వారి సహచరులను వదిలేసి, వారికి మోకరిల్లిందని ఆయన అన్నారు. అటువంటి సంఘటనలు తమ ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ జరగలేదని ఆయన చెప్పుకున్నారు. కరీంగనగర్ జిల్లా గోదావరిఖని బహిరంగ సభలో ఆయన శనివారం కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటోందని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకం, రైతు రుణాల మాఫీ వంటివాటిని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. కాంగ్రెసును గెలిపించి భారత అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ తాము అమలు చేశామని ఆయన చెప్పారు. తాము నిరుపేదల పక్షాన ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications