పార్టీల నేతల ఉచిత వినోదం: వెంకయ్య
విశాఖపట్నం: ప్రజాసమస్యలు పక్కనబెట్టి కొన్ని రాజకీయపార్టీలు పరస్పర దూషణలతో ఉచిత వినోద కాలక్షేపాన్ని అందిస్తున్నాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం శనివారం విశాఖపట్నం వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రసారమాధ్యమాలు కూడా ఈ తరహా ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని అన్నారు.
కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలు అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్సించారు. రాత్రివేళ ప్రచారం వల్ల ధనప్రవాహం పెరుగుతుందని ఎన్నికల కమిషన్ (ఈసీ) దీనిపై పునరాలోచించాలని ఆయన కోరారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదం పెరిగిందని ఆయన అన్నారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications